ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కొడాలి నానిని మంత్రి వర్గం నుంచి తొలగించాలి'

విశాఖ జిల్లా చోడవరంలోని ద్వారాకానగర్​కు చెందిన షేక్ మీరా బీబీ అనే వృద్ధురాలు... ప్రభుత్వం ఇచ్చే రేషన్ సరకుల కోసం దుకాణానికి వెళ్లి క్యూలో నిలుచుని ఎండ వేడికి తాళలేక సొమ్మసిల్లి పడిపోయి చనిపోయిన ఘటన తనను కలచివేసిందని మాజీ మంత్రి దేవినేని ఉమా ఆవేదన వ్యక్తం చేశారు. వృద్ధురాలి మృతికి మంత్రి కొడాలి నాని నైతిక బాధ్యత వహించి... రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

devineni uma
'విశాఖ వృద్ధురాలి మృతికి.. మంత్రి కొడాలి నైతిక బాధ్యత వహించాలి'

By

Published : Mar 31, 2020, 7:34 AM IST

'విశాఖ వృద్ధురాలి మృతికి.. మంత్రి కొడాలి నైతిక బాధ్యత వహించాలి'

విశాఖ జిల్లా చోడవరం ద్వారకా నగర్​కు చెందిన షేక్ మీరాబీ రేషన్ కోసం...క్యూ లైన్​లో ఉండి మృతి చెందటం చాలా బాధాకరమని మాజీమంత్రి దేవినేని ఉమా ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై సీఎం జగన్ స్పదించి మృతురాలి కుటుంబానికి పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేసారు. పౌర సరఫరాల శాఖ నుంచి మంత్రి కొడాలి నానిని తొలగించి సీఎం స్వయంగా బాధ్యతలు తీసుకోవాలన్నారు. ఇంటికే రేషన్ పంపుతామని స్వయంగా చెప్పిన మంత్రి నాని... వృద్ధురాలి మృతికి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రైతు బజార్లలో పూర్తి స్థాయిలో సౌకర్యాలు లేవని మండిపడ్డారు.

ఇవీ చూడండి-రేషన్ దుకాణానికి వెళ్లి వృద్ధురాలి మృతి

ABOUT THE AUTHOR

...view details