విశాఖ జిల్లా అనకాపల్లిలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అనకాపల్లి నూకాలమ్మ ఆలయంలో దసరా ఉత్సవాలను మాజీఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ ప్రారంభించారు. ఉత్సవాల్లో భాగంగా శతకం పట్టు కనకదుర్గ ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. మాజీఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ ఆర్థిక సాయంతో భవాని మాలధారణ భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
కామాక్షి ఆలయంలో...
జిల్లాలోని గవరపాలెం నిదానం దొడ్డి కామాక్షి ఆలయంలో దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. వైకాపా పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు దాడి రత్నాకర్ అమ్మవారిని దర్శించుకున్నారు.
పార్క్ సెంటర్ శివశక్తి ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలు మొదలయ్యాయి. లక్ష్మీదేవిపేటలోని కనకదుర్గ ఆలయంలో స్వర్ణకవచ దేవిగా అమ్మవారిని అలంకరించారు.