విశాఖ జిల్లా దేవరాపల్లి మండలం రైవాడ జలాశయానికి మోక్షం లభించింది. జలాశయం వద్ద అభివృద్ధి, మరమ్మత్తు పనులు ముమ్మరంగా చేపడుతున్నారు. ప్రధాన గట్టుకి రక్షణగా సిమెంట్ గోడ, సిమెంట్ ర్యాంపులు, స్పిల్ వే గేట్లు వద్ద కాంక్రీట్ పనులు చేపడుతున్నారు. ఈ పనులు పూర్తయితే జలాశయానికి రక్షణ పెరుగుతుంది. మరోవైపు రైతులు, సందర్శకులకు ఇబ్బందులు తీరనున్నాయి. ప్రభుత్వం కేటాయించిన ప్రత్యేక నిధులు నుంచి రూ.28 లక్షలతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు జలాశయం డీఈఈ మాధవి చెప్పారు.
రైవాడ జలాశయం వద్ద అభివృద్ధి పనులు... తీరనున్న సమస్యలు - visakhapatnam district latest news
విశాఖ జిల్లా రైవాడ జలాశయం అభివృద్ధి పనులను ముమ్మరం చేశారు. ప్రత్యేక నిధులు నుంచి రూ.28 లక్షలతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు జలాశయం డీఈఈ మాధవి చెప్పారు. త్వరలోనే రైతుల సమస్యలు తీరనున్నాయి.
రైవాడ జలాశయం వద్ద అభివృద్ధి పనులు... తీరనున్న సమస్యలు