విశాఖలో ఇటీవల విమానాశ్రయం, పెందుర్తి, ఎమ్మార్‌పేట, టూటౌన్ పీఎస్ పరిధిలో పలు దొంగతనాలు జరిగాయి. చోరీలపై నిఘా పెట్టిన పోలీసులు.. మొత్తం 7 కేసుల్లో ఐదుగురు నిందితులు, బాల నేరస్థుడుని అరెస్టు చేశారు. వారి నుంచి 4 బైక్‌లు, 3 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు క్రైమ్ డీసీపీ సురేష్‌బాబు వివరించారు.
విశాఖలో దొంగలు అరెస్ట్..ద్విచక్రవాహనాలు, బంగారు ఆభరణాలు స్వాధీనం - విశాఖ క్రైమ్ డీసీపీ
విశాఖలోని వివిధ ప్రాంతాల్లో పలు దొంగతనాలకు పాల్పడుతున్న దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి ద్విచక్ర వాహనాలు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
![విశాఖలో దొంగలు అరెస్ట్..ద్విచక్రవాహనాలు, బంగారు ఆభరణాలు స్వాధీనం Detention of accused in several theft cases](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12938162-236-12938162-1630490018566.jpg)
పలు చోరీ కేసుల్లో నిందితుల పట్టివేత