ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పట్టాలు తప్పిన విశాఖ-కిరండోల్ రైలు.. ప్రయాణికులు సురక్షితం - పట్టాలు తప్పిన విశాఖ రైలుతప్పిన పెను ప్రమాదం

Shivalingapuram Railway Station: విశాఖ నుంచి అరకు వెళ్లే విశాఖ - కిరండోల్ రైలు పట్టాలు తప్పింది. కొత్తవలస- అరకు సెక్షన్ లో శివలింగపురం రైల్వే స్టేషన్​కు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.

Visakha Kirandol train
Visakha Kirandol train

By

Published : Jan 17, 2023, 12:13 PM IST

Updated : Jan 17, 2023, 12:32 PM IST

Shivalingapuram Railway Station: విశాఖ నుంచి అరకు వెళ్లే విశాఖ - కిరండోల్ ప్యాసింజర్​ రైలు పట్టాలు తప్పింది. కొత్తవలస- అరకు సెక్షన్​లో శివలింగపురం రైల్వే స్టేషన్​కు సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ చక్రాలు ట్రాక్ నుంచి పక్కకు జరిగిపోయాయి. సమాచారం అందుకున్న వాల్తేర్ డివిజన్ అధికారులు హుటాహుటిన విశాఖ నుంచి యాక్సిడెంట్ రిలీఫ్ మెడికల్ ట్రైన్​లో పునరుద్ధరణ పనులు చేసేందుకు బయలుదేరి వెళ్లారు. ఈ కోచ్​లో ప్రయాణిస్తున్న వారికి ఎటువంటి ప్రమాదం, గాయాలు కాలేదని వాల్తేర్ డివిజన్ అధికారులు తెలిపారు.

పట్టాలు తప్పిన విశాఖ-కిరండోల్ రైలు.. ప్రయాణికులు సురక్షితం
Last Updated : Jan 17, 2023, 12:32 PM IST

ABOUT THE AUTHOR

...view details