ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎన్నికలకు ముందు.. మద్యపాన నిషేధం..!: కోలగట్ల వీరభద్ర స్వామి - జగన్ వార్తలు

Deputy Speaker Kolagatla Veerabhadra Swamy: ప్రభుత్వం త్వరలో మద్యపాన నిషేదంపై ఓ నిర్ణయం తీసుకుంటుందని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి అన్నారు. కరోనా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకోని ఎన్నికలలోపు మద్యం నిషేధించే అవకాశాలు ఉన్నట్లు ఆయన తెలిపారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా గడప గడపకు మన ప్రభుత్వం చేపట్టి సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరిస్తుంటే,.. టీడీపీ బాదుడే బాదుడు కార్యక్రమం ద్వారా ఒక్క ఇంటి తలుపుతట్టి ప్రజల సమస్యలు తెలుసుకున్నారా అని ప్రశ్నించారు.

Deputy Speaker Kolagatla Veerabhadra Swamy:
డిప్యూటీ స్పీకర్ కొలగట్ల వీరభద్ర స్వామి

By

Published : Dec 25, 2022, 8:22 PM IST

Updated : Dec 25, 2022, 8:28 PM IST

Kolagatla Veerabhadra Swamy on Liquor : మద్యపాన నిషేధ ఆలోచన ప్రభుత్వ చర్చల దశలో ఉందని, ఆ నిర్ణయం తీసుకుంటే వంద షాపులు ఉన్నా, పది షాపులు ఉన్నా.. మూతపడక తప్పదని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి అన్నారు. కరోనా వల్ల రాష్ట్ర ఆర్ధిక పరిస్దితి అన్ని పరిగణనలోకి తీసుకుని దీనిని పరిశీలించాల్సి ఉంటుందని తెలిపారు. ఎన్నికల ముందు మద్యపాన నిషేధంపై నిర్ణయం ఉండే అవకాశం ఉందని విశాఖలో ఆయన తెలిపారు.

విజయనగరంలో రాత్రి అశోక్ గజపతి బంగ్లాలో బస చేసిన చంద్రబాబు కుట్రలకు, కుతంత్రాలకు తెర తీస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు బహిరంగ సభకు డబ్బులు ఇచ్చి జనాన్ని తీసుకువచ్చారని, ఆయన మాటలను జనం నమ్మే పరిస్ధితి లేదని ఎద్దేవా చేశారు.

డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి

'సంపూర్ణ మద్యపాన నిషేధం అనేది మా దృష్టిలో ఉంది. అయితే రాష్ట్ర అర్థిక పరిస్థితులు, కరోనా కారణంగా ఇంకా మద్యం షాపులు నడుస్తున్నాయి. దీనిపై ఎన్నికలలోపు నిర్ణయం తీసుకుంటారు. విజయనగరంలో నిన్న రాత్రి అశోక్ గజపతి బంగ్లాలో బస చేసిన చంద్రబాబు రాష్ట్రంలో మళ్లీ కుట్రలు, కుతంత్రాలకు తెరతీస్తున్నారు. 1995 అశోక్ గజపతి బంగ్లాలో ఎలాగైతే కుట్రలకు తెరతీశారో మళ్లీ అదే బంగ్లాలో నిన్న బస చేశారు కనుక.. మళ్లీ ఎలాంటి కుట్రలకు తెరలేపుతారోననే అనుమానం కలుగుతోంది.' -కోలగట్ల వీరభద్ర స్వామి, డిప్యూటీ స్పీకర్

ఇవీ చదవండి:

Last Updated : Dec 25, 2022, 8:28 PM IST

ABOUT THE AUTHOR

...view details