జీవితంలో ఏ విషయంలోనైనా గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ప్రయత్నం చేసినప్పుడే విజయం వరిస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆంధ్ర యూనివర్సిటీ వేదికగా గురుకుల పాఠశాలల రాష్ట్ర స్థాయి ఆటల పోటీలను శ్రీవాణి ప్రారంభించారు. రన్నింగ్, కబడ్డీ, ఆర్చరీ వంటి అథ్లెటిక్స్ పోటీలు... మూడు కేటగిరీల్లో నిర్వహించనున్నారు. గిరిజన విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసే ఉద్దేశంతో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి తెలిపారు.
విశాఖలో గురుకుల పాఠశాలల రాష్ట్రస్థాయి ఆటల పోటీలు - విశాఖలో గురుకుల పాఠశాలల రాష్ట్రస్థాయి ఆటల పోటీలు
ఆంధ్ర యూనివర్సిటీ వేదికగా... గురుకుల పాఠశాలల రాష్ట్ర స్థాయి ఆటల పోటీలను ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి ప్రారంభించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
గురుకుల పాఠశాలల రాష్ట్రస్థాయి ఆటల పోటీలను ప్రారంభించిన పుష్పాశ్రీవాణిి