ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

DHARMANA: 'సమగ్ర భూ సర్వే రక్షణతో.. వివాదాలకు తావుండదు'

'జగనన్న శాశ్వత భూ హక్కు - భూ రక్షణ' పథకాన్ని మంత్రి ధర్మాన విశాఖ జిల్లాలో ప్రారంభించారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ. 1,000 కోట్లను వెచ్చించిందన్నారు. వివాదాలకు తావులేకుండా, యాజమాన్య హక్కులను కాపాడనుందని తెలిపారు.

DHARMANA
సమగ్ర భూ సర్వే రక్షణతో.. వివాదలకు తావుండదు

By

Published : Jul 15, 2021, 9:30 PM IST

విశాఖ జిల్లా ఎలమంచిలి మండలం పులపర్తి గ్రామంలో 'జగనన్న శాశ్వత భూ హక్కు - భూ రక్షణ' పథకాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ ప్రారంభించారు. సర్వే చేసిన భూముల్లో సరిహద్దు రాళ్లు వేశారు. ముఖ్యమంత్రి జగన్ రూ. 1,000 కోట్లతో సమగ్ర భూ సర్వే రక్షణ పథకాన్ని ప్రారంభించారని నేతలు చెప్పారు. ఈ పథకం వల్ల భూ వివాదాలకు తావు ఉండదని పేర్కొన్నారు.

ప్రతి రైతు భూమికీ రక్షణ ఉంటుందని స్పష్టం చేశారు. వంద సంవత్సరాల తర్వాత ఇటువంటి మహత్తర కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారని ప్రశంసించారు. ప్రతి భూమికి ఒక ప్రత్యేక గుర్తింపు నెంబరు ఇస్తారని తెలిపారు. ఇదే రీతిలో ఇళ్ల సర్వే కూడా నిర్వహిస్తారని చెప్పారు. రాష్ట్రంలో భూ వివాదాలను శాశ్వతంగా పరిష్కరించడం కోసం.. ఈ సర్వే ఎంతో ఉపయోగపడుతుందని వారు విశ్వాసం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details