DEPUTY CM BUDI MUTYALA NAIDU ANGRY ON REPORTER: విశాఖలో జరిగిన జిల్లా పరిషత్ సమావేశంలో ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. తన సొంత గ్రామం "తారవ"లో త్రాగునీటి సమస్య ఉందని ఓ విలేకరి ప్రశ్నకు ఆగ్రహించిన మంత్రి.. నీటి సమస్య ఉందని రుజువు చేస్తే అన్ని పదవులకు రాజీనామా చేస్తానని.. లేనిపక్షంలో అసత్యాలు ప్రచారం చేస్తున్నట్టు ఒప్పుకోవాలని సవాల్ విసిరారు. తన గ్రామానికి మీడియాను తీసుకువెళ్తానని.. త్రాగునీటి సమస్య ఉందో లేదో నిర్ధారించుకోవచ్చని చెప్పుకొచ్చారు. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మీడియా ప్రతినిధులపై ఉపముఖ్యమంత్రి ఫైర్.. ఆ ప్రశ్న అడిగినందుకేనా? - DEPUTY CM BUDI MUTYALA NAIDU
DEPUTY CM FIRES ON REPORTER: విశాఖలో జరిగిన మీడియా సమావేశంలో ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు ఆవేశంతో ఊగిపోయారు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలపై అసహనం వ్యక్తం చేశారు. తన స్వగ్రామంలో నీటి ఎద్దడిపై ఓ ఛానెల్ ప్రతినిధి అడిగిన ప్రశ్నపై చిర్రుబుర్రులాడారు.
DEPUTY CM FIRES ON REPORTER