పాడేరులో ఇద్దరు వైకాపా ఎంపీటీసీలపై బహిష్కరణ వేటు - paderu ysrcp mptc elections updates
13:19 September 26
పాడేరులో ఇద్దరు వైకాపా ఎంపీటీసీలపై బహిష్కరణ వేటు
విశాఖ జిల్లా పాడేరులో ఇద్దరు వైకాపా ఎంపీటీసీలపై బహిష్కరణ వేటు పడింది. పాడేరులో వైకాపా రెబల్ అభ్యర్థిని ఎంపీపీగా ఎన్నికయ్యారు. జి. మాడుగులలో.. తెలుగుదేశం, వైకాపా సమాన సీట్లు గెలిచినప్పటికీ స్వతంత్ర అభ్యర్థికి ఎంపీపీ (MPP) పదవి కట్టబెట్టడంపై.. పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ తరఫున గెలిచి.. తెలుగుదేశం మద్దతుతో ఎంపీపీ అయిన వ్యక్తులను.. పార్టీలో కొనసాగించబోమని తెలిపారు. వైకాపాకు వ్యతిరేకంగా ఉన్న వంతాడపల్లి ఎంపీటీసీ, సలుగు ఎంపీటీసీ సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: