దళితులపై దురాగతాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని విశాఖ జిల్లా నర్సీపట్నం సబ్ కలెక్టర్ అన్నారు. రావికమతం మండలం గుమ్మలపాడు గ్రామాన్ని సందర్శించారు. దళిత కుటుంబాల బహిష్కరణకు సంబంధించిన ఘటనపై విచారణ చేపట్టారు. అక్కడి పరిస్థితులపై గ్రామస్థులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
దళిత సామాజిక వర్గానికి చెందిన యువతిని అగ్రవర్ణానికి చెందిన యువకుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని.... దళిత కుటుంబాలను గ్రామ బహిష్కరణ చేయడం దారుణమని పేర్కొన్నారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించడం జరుగుతుందని అన్నారు. ఈ చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.