ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఎర్త్ అవర్​ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొనండి' - earth hour program recent news

విశాఖలోని సీతమ్మధార జీవీఎంసీ పాఠశాలలో.. ఎర్త్ అవర్​పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా భూతాపంతో కలిగే నష్టాలను విద్యార్థులకు వివరించారు.

earth hour
ఎర్త్ అవర్​పై అవగాహన

By

Published : Mar 28, 2021, 9:05 AM IST

'భూగోళం భవిష్యత్తును కాపాడేందుకు... ఒక గంట పాటు విద్యుత్ దీపాలు ఆపేద్దాం' అంటూ.. విశాఖలోని సీతమ్మధార జీవీఎంసీ పాఠశాలలో ఎర్త్ అవర్​పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఎర్త్ అవర్ సందర్భంగా రాత్రి ఎనిమిదిన్నర నుంచి తొమ్మిదన్నర గంటల వరకు స్వచ్ఛందంగా విద్యుద్దీపాలను ఆర్పివేయాలని... జీవీఎంసీ యూఎన్​డీపీ, గ్రీన్ క్లైమేట్ సంస్థ సంయుక్తంగా అవగాహన ప్రదర్శన నిర్వహించాయి.

భూమిపై మానవులకు ఉన్న బాధ్యతను తెలియజేసేందుకు.. రాత్రి విద్యుద్దీపాలు, విద్యుత్ పరికరాలు గంట సేపు నిలిపివేయటం ద్వారా, ప్రతి ఒక్కరూ తమ భాగస్వామ్యాన్ని ప్రకటించవచ్చునన్నారు. ఎర్త్ అవర్ నిర్వహణ ద్వారా.. ప్రజల్లో భూతాపం వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించవచ్చునని అన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అరుణ కుమారి, గ్రీన్ క్లైమేట్ బృందం వ్యవస్థాపకుడు జేవీ రత్నం, జీవీఎంసీ యూఎన్​డీపీ అధికారులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details