విశాఖ జిల్లా భీమునిపట్నం జోన్ మంగమారిపేట వద్ద సీఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన గోకార్టింగ్ అక్రమ నిర్మాణాలను జీవీఎంసీ అధికారులు కూల్చివేశారు. 299-1301లో పార్టు సర్వే నెంబర్లలో ఉన్న 4 ఎకరాల 48 సెంట్లలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను తొలగించారు. జీవీఎంసీ డిప్యుటీ సిటీప్లానర్ రాంబాబు ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు మధ్య ప్రక్రియ చేపట్టారు.
మంగమారిపేటలో అక్రమ నిర్మాణాల కూల్చివేత - మంగమారిపేటలో అక్రమ నిర్మాణాలు కూల్చివేత వార్తలు
విశాఖ జిల్లా మంగమారిపేటలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను జీవీఎంసీ అధికారులు కూల్చివేశారు. దాదాపు నాలుగున్నర ఎకరాల్లో ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించారు.
అక్రమ నిర్మాణాల కూల్చివేత