ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆక్రమణలపై ఉక్కుపాదం.... వేగంగా భవనాలు ధ్వంసం - buildings

అక్రమ నిర్మాణాలపై కటినంగా వ్యవహరించాలని కలెక్టర్ల సమావేశంలో సీఎం జగన్ ఇచ్చిన ఆదేశాల మేరకు విశాఖలో అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. జీవీఎంసీ పరిధిలో ఆక్రమణల ఏరివేతపై దృష్టి సారించారు.

భవనాలను ధ్వంసం చేస్తున్న కార్మికులు

By

Published : Jun 28, 2019, 6:38 AM IST

Updated : Jun 28, 2019, 1:25 PM IST

విశాఖలో ఆక్రమణల కూల్చివేత పర్వం ప్రారంభమైంది. అమరావతిలో ప్రజావేదిక కూల్చివేత అనంతరం విశాఖ నగరంలోను జీవీఎంసీ అధికారులు ఆక్రమణలపై దృష్టి పెట్టారు. గురువారం ఒక్కరోజే సుమారు పదికిపైగా భవనాలు కూల్చి వేయడం సహా ఆక్రమణలు తొలగించారు. పెదగదిలి, బీసీ కాలనీ, కేఆర్ఎం కాలనీ, సీబీఐ డౌన్, అల్లిపురం, ఐటీఐ కూడలి, జ్యోతి నగర్, చినగంట్యాడ, పల్లి నారాయణపురం, వేపగుంట సహా అనకాపల్లిలోని గవరపాలెం, గాంధీనగర్​లోని అక్రమ కట్టడాలను ధ్వంసం చేశారు. ఇప్పటికే నగర పాలక సంస్థ కమిషనర్ సృజన్ జోనల్ కమిషనర్లతో ఈ అంశంపై ప్రత్యేకంగా సమీక్షించారు. అక్రమ కట్టడాలపై కఠిన వైఖరితో ఉండాలన్న ప్రభుత్వ ఆదేశాలను పాటించాల్సిందిగా అధికారులతో చెప్పినట్లు తెలుస్తోంది. శుక్రవారం కూడా నగరంలో ఆక్రమణల కూల్చివేత ప్రక్రియ కొనసాగనున్నట్లు తెలుస్తోంది.

Last Updated : Jun 28, 2019, 1:25 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details