విశాఖ మన్యంలో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ప్రకాష్తో పాటు గిరిజన సంక్షేమ శాఖ సంచాలకుడు రంజిత్ భాషా, జిల్లా కలెక్టర్ వినయ్చంద్తో పాటు పలువురు అధికారులు పర్యటించారు. అమరావతి నుంచి హెలికాప్టర్లో విశాఖ జిల్లా గూడెంకొత్తవీధి మండల కేంద్రంలోని ఏకలవ్య పాఠశాలకు చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన 71వ వనమహోత్సవంలో మొక్కలు నాటారు.
ఈనెల 9న ప్రపంచ ఆదివాసీల దినోత్సవం సందర్భంగా.... ఆదివాసీలకు అటవీ హక్కుల పత్రాలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే ఉన్నతాధికారుల బృందం మన్యంలో పర్యటించిందని స్థానిక అధికారులు తెలిపారు. రెండు రోజుల పాటు మన్యంలో పర్యటిస్తారని అన్నారు.