విశాఖపట్నంలోని సింహాచలం సింహాద్రి అప్పన్న సన్నిధిలో చందన దీక్షల విరమణలు జరిగాయి. 40 రోజులపాటు మాల వేసుకుని స్వామిని ఆరాధించిన భక్తులు... ఇరుముడి సమర్పించి దీక్ష విరమణ చేశారు. అనంతరం అప్పన్నని దర్శనం చేసుకున్నారు. దీక్షల విరమణకు ఈ రోజే ఆఖరి రోజు కావడంతో వివిధ జిల్లాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు.
సింహాద్రి అప్పన్న సన్నిధిలో వైభవంగా చందన దీక్షల విరమణ - సింహాద్రి అప్పన్న దీక్షల విరమణ
విశాఖలోని సింహాద్రి అప్పన్న ఆలయానికి మాల వేసుకున్న భక్తలు తరలివచ్చి.. దీక్ష విరమణ చేశారు. ఇందులో భాగంగా భక్తులు శోభాయాత్ర నిర్వహించి.. శాంతి హోమం చేశారు.

సింహాద్రి అప్పన్న
కొవిడ్ కారణంగా ఈ ఏడాది దీక్షల విరమణ, కొండ దిగువన చేసేందుకు ఆలయ అధికారులు ఏర్పట్లు చేశారు. దీంతో భక్తులు నిబంధనలు పాటిస్తూ స్వామికి కొండ దిగువున ఇరుముడి సమర్పించారు.
ఇదీ చదవండి:ఆలయాభివృద్ధికి పరిపాలన అనుమతులు జారీ