విశాఖ జిల్లా మాడుగుల మండలం పెద్దేరు జలాశయం పూర్తి నీటిమట్టం 137 మీటర్లు కాగా, ప్రస్తుతం 130.05 మీటర్లకు తగ్గింది. దీంతో అప్రమత్తమైన జలవనరుల శాఖ అధికారులు రాచకట్టు సాగునీటి కాలువలకు 50 నుంచి 15 క్యూసెక్కులకు నీటి విడుదల తగ్గించారు. ఇన్ ఫ్లో 15 క్యూసెక్కుల మేరకు జలాశయంలోకి వచ్చి చేరుతోంది.
జలాశయాల్లో తగ్గుతున్న నీటిమట్టాలు.. సాగునీటి విడుదల కుదింపు
విశాఖ జిల్లాలోని కోనాం, పెద్దేరు జలాశయాల నీటిమట్టాలు తగ్గడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆయకట్టుకు అందించాల్సిన సాగునీటి విడుదలను కుదించారు.
జలాశయాల్లో తగ్గుతున్న నీటిమట్టాలు
చీడికాడ మండలం కోనాం జలాశయం నీటిమట్టం రోజురోజుకు తగ్గుతోంది. పూర్తి నీటిమట్టం 101.25 మీటర్లు కాగా, ప్రస్తుతం 94.65 మీటర్లకు తగ్గింది. దీంతో అధికారులు.. ఎగువ సాగునీటి కాలువ గేటు మూసివేశారు. దిగువ కాలువలకు 20 క్యూసెక్కుల నీటిని మాత్రమే విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి ఊట నీరు ఇన్ ఫ్లో 15 క్యూసెక్కులు వస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి:కాల్సైట్ ఖనిజ తవ్వకాలకు.. మళ్లీ టెండర్లు!