విశాఖ జిల్లాలో కరోనా తగ్గుముఖం పడుతుంది. గతంతో పోలిస్తే కరోనా కేసులు తక్కువగా నమోదవుతున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. కొన్ని నెలల కిందట రోజుకు 1000 కరోనా కేసులు నమోదు కాగా...ప్రస్తుతం 175 నుంచి 225 కేసులు నమోదవుతున్నట్లు వైద్యులు తెలిపారు. అయినప్పటికి అలసత్వం ప్రదర్శించవద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం జిల్లా మొత్తం మీద 12 వేల పడకలు అందుబాటులో ఉండగా.. పది శాతం కంటే తక్కువగానే పేషెంట్లు ఉంటున్నారని అధికారులు చెబుతున్నారు.
విశాఖ జిల్లాలో తగ్గుముఖం పట్టిన కరోనా - corona latesst news
విశాఖ జిల్లాలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కొన్ని నెలల కిందట సగటున రోజుకు 1000 కరోనా కేసులు నమోదు కాగా ప్రస్తుతం 175 నుంచి 225కు తగ్గినట్లు వైద్యులు తెలిపారు.
విశాఖ జిల్లాలో తగ్గుముఖం పట్టిన కరోనా
జిల్లాలో సుమారు 2,200 మంది వైరస్ బాధితులు ఉండగా, వీరిలో 700 మంది ఆస్పత్రిలోనూ, మరో 500 మంది సేవా కేంద్రాల్లోనూ, మిగిలిన వెయ్యి మంది ఇళ్లలోనూ చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో కోవిడ్ కోసం కేటాయించిన ఆసుపత్రుల సంఖ్యను దశలవారీగా తగ్గించనున్నారు. జిల్లాలో ఏ కేటగిరి జాబితాలో ఉన్న 22 ఆసుపత్రుల్లో.. 14 ఆసుపత్రులను బి కేటగిరిలో తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు.
ఇదీ చదవండి