ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖ వేదికగా డిసెంబర్‌ 4న నౌకాదళ దినోత్సవం

Navy Day 2022 Celebrations: ఈ ఏడాది డిసెంబర్‌ 4న నిర్వహిచే నౌకాదళ దినోత్సవానికి ఈస్ట్రన్‌ కమాండ్‌ ప్రధాన కేంద్రం విశాఖపట్నం వేదిక కానుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, ప్రధాన దళాధిపతి - సీడీఎస్​ అనిల్‌ చౌహాన్‌తో పాటు, త్రివిధ దళాధిపతులు హాజరుకానున్నట్లు అధికారులు తెలిపారు.

Navy Day 2022 Celebrations
Navy Day 2022 Celebrations

By

Published : Nov 8, 2022, 10:49 AM IST

నౌకాదళ దినోత్సవానికి వేదిక కానున్న విశాఖపట్నం

Navy Annual day will be in Vizag: ఈ ఏడాది నౌకాదళ దినోత్సవానికి ఈస్ట్రన్‌ కమాండ్‌ ప్రధాన కేంద్రం విశాఖపట్నం వేదిక కానుంది. ఏటా డిసెంబర్‌ 4న నిర్వహించే నౌకాదళ దినోత్సవం ఈసారి.. విశాఖలో నిర్వహిస్తున్నట్లు నౌకాదళ వర్గాలు ధ్రువీకరించాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, ప్రధాన దళాధిపతి -సీడీఎస్ అనిల్‌ ఛౌహాన్‌తో పాటు, త్రివిధ దళాధిపతులు హాజరుకానున్నారు. ఈ సందర్బంగా విశాఖ బీచ్‌ రోడ్డులో ఆరోజు ప్రత్యేక విన్యాసాలు నిర్వహించనున్నట్లు నౌకాదళ వర్గాలు తెలిపాయి. రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. తొలిసారి రక్షణ శాఖకు సంబంధించిన కార్యక్రమంలో ద్రౌపది ముర్ము హాజరుకానున్న నేపథ్యంలో... కొత్త తరహాలో స్వాగతం పలకేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇటీవల నౌకాదళంలో చేరిన ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ సహా యుద్ద నౌకలు, సబ్‌మెరైన్‌లు విన్యాసాల్లో భాగం కానున్నాయి.

ABOUT THE AUTHOR

...view details