ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చిన్నారి సమాధి వద్దకు సారె.. ఎందుకంటే...! - భోగాపురం తీర్థం వార్తలు

పండగలు అంటే గ్రామాల్లో సాధారణంగా.. అమ్మవారి పేరునో లేదంటే గ్రామదేవతల పేరున ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. కానీ.. ఆ గ్రామంలో మాత్రం ఓ చిన్నారి వర్థంతిని తీర్థ మహోత్సవంగా నిర్వహిస్తారు. పెద్ద ఎత్తున జాతర నిర్వహించి మెుక్కులు చెల్లించుకోవటం అక్కడ ఆనవాయితీగా వస్తోంది. ఈ విధంగా ఎక్కడ చేస్తున్నారో తెలుసుకోవాలని ఉందా.. అయితే ఆలస్యం చేయకుండా ఈ కథనాన్ని చదివేయండి.

death anniversary celebrated as festival
చిన్నారి సమాధి వద్దకు సారె

By

Published : Feb 4, 2021, 2:27 PM IST

Updated : Feb 4, 2021, 5:42 PM IST

విశాఖ జిల్లా రోలుగుంట మండలం భోగాపురంలో.. చిన్నారి వర్థంతిని గ్రామస్థులు తీర్థమహోత్సవంగా నిర్వహిస్తున్నారు. ఏడేళ్లుగా ఈ ఆనవాయితీని కొనసాగిస్తూ.. చిన్నారి సమాధి వద్ద మెుక్కులు సైతం చెల్లించుకుంటున్నారు. భోగాపురానికి చెందిన సీతారామమూర్తి, ఉమా నాయుడు ఏకైక కుమార్తె.. చందన అలియాస్ అమ్ము ఏడేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. ఆ చిన్నారి జ్ఞాపకార్థంగా.. చిన్నారి సమాధి వద్ద తల్లిదండ్రులు ఏటా భారీగా తీర్థ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.

చిన్నారి సమాధి వద్దకు సారె

ఇంటి వద్దే సమాధిని ఏర్పాటు చేసి.. అందంగా పూలతో అలంకరించి, చిన్నారికి ఇష్టమైన తినుబండరాలు, స్వీట్లు, ఫలహారాలు, పిండివంటలు.. పట్టు వస్త్రాలను సమాధి చుట్టూ పేర్చుతారు. ఈ సందర్బంగా ప్రత్యేక పూజలు సైతం నిర్వహిస్తారు. 2,500 మందికి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు. చిన్నారి వర్థంతిని ఈ విధంగా తీర్థ మహోత్సవాన్ని నిర్వహించటం ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా నిలుస్తోంది.

Last Updated : Feb 4, 2021, 5:42 PM IST

ABOUT THE AUTHOR

...view details