పట్టాలు దాటుతుండగా గూడ్స్ రైలు ఢీకొని బధిర బాలుడు మృతి చెందిన ఘటన విశాఖ జిల్లా గోపాలపట్నంలో జరిగింది. వేపగుంట చీమలాపల్లికి చెందిన అప్పలకొండ, మహాలక్ష్మి దంపతుల కుమారుడు మోహన కృష్ణ(15) స్థానిక పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. మిత్రుడిని కలిసేందుకు గోపాలపట్నం వెళ్లాడు. అనంతరం తిరిగి ఇంటికి చేరే క్రమంలో పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొట్టింది.
తీవ్రగాయాలైన బాలుడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. చికిత్సపొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. రైలు శబ్దం వినిపించకపోవటం వల్ల ప్రమాదం జరిగిందని వివరించారు.