ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తప్పుడు సమాచారాన్ని నిరోధించడమే కీలకం - వాస్తవ సమాచారంపై ప్యాక్ట్ చెక్

Workshop in Andhra University: అమెరికా, భారతదేశాల ప్రజాస్వామ్యానికి ముప్పు తెచ్చే తప్పుడు సమాచారాన్ని నిరోధించటం కీలకమైన అంశం అని హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్ జనరల్ డిప్లమసీ ఆఫీసర్ డేవిడ్ మోయర్ అన్నారు. ఆంధ్రా యూనివర్సిటీలోని అమెరికన్ కార్నర్‌లో జరిగిన వర్క్ షాప్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

us consulate general
us consulate general

By

Published : Aug 1, 2022, 7:06 PM IST

Updated : Aug 12, 2022, 9:25 AM IST

American Corner in Andhra University: అమెరికా, భారతదేశాల ప్రజాస్వామ్యానికి ముప్పు తెచ్చే తప్పుడు సమాచారాన్ని నిరోధించటం కీలకమైన అంశం అని హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్ జనరల్ డిప్లమసీ ఆఫీసర్ డేవిడ్ మోయర్ అన్నారు. ఆంధ్రా యూనివర్సిటీలోని అమెరికన్ కార్నర్‌లో జరిగిన వర్క్ షాప్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అసత్య, అర్ధ సత్య వార్తలపై ఏపీ, తెలంగాణలోని టీవీ జర్నలిస్టులకు ఇస్తున్న శిక్షణ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. అమెరికా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంబంధాలకు చారిత్రక నేపథ్యం ఉందని,.. భవిష్యత్తులో మరింత బలోపేతం అయ్యేందుకే ఆంధ్రా యూనివర్సిటీలో అమెరికన్ కార్నర్‌ను ఏర్పాటు చేసినట్లు డేవిడ్ మోయర్ చెప్పారు. ఫ్యాక్ట్ చెక్‌కు సంబంధించిన ప్రాధమిక అంశాలను, టూల్స్​ను ప్రముఖ ఫ్యాక్ట్ చెకర్ సుధాకర్ రెడ్డి వివరించారు.

critical thinking techniques: సమాచారం యొక్క వరద నుండి వాస్తవాలను జల్లెడ పట్టడానికి క్రిటికల్ థింకింగ్ టెక్నిక్‌లను ఉపయోగించాలని ఆంధ్రా యూనివర్శిటీ జర్నలిజం విభాగాధిపతి ప్రొఫెసర్ డీవీఆర్ మూర్తి తెలిపారు. సామాన్య ప్రయోజనాల కోసం తప్పుడు సమాచారాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని.. ఉస్మానియా యూనివర్సిటీ జర్నలిజం విభాగాధిపతి ప్రొఫెసర్ స్టీవెన్‌సన్ కోహిర్ అన్నారు.

ఇది చదవండి:

Last Updated : Aug 12, 2022, 9:25 AM IST

ABOUT THE AUTHOR

...view details