ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మాకవరపాలెంలో గుర్తింపు కార్డులివ్వాలని డప్పు కళాకారుల ధర్నా - మాకవరపాలెం మండల కార్యాలయం వద్ద డప్పు కళాకారుల ధర్నా

మాకవరపాలెం మండల తహసీల్దార్​ కార్యాలయం వద్ద డప్పు కళాకారులు ధర్నా చేసారు. తమకు గుర్తింపు కార్డులు మంజూరు చేయాలంటూ కోరారు. అర్హులైన లబ్దిదారులను ఎస్సీ కార్పొరేషన్​ రుణాలకు ఎంపిక చేయాలని డిమాండ్​ చేశారు.

dappu artists protest at makavarapalem mandal office and given letter to mro
తమకు గుర్తింపు కార్డు మంజూరు చేయాలంటూ డప్పు కళాకారుల ధర్నా

By

Published : Jul 18, 2020, 3:28 PM IST

జిల్లాలోని డప్పు కళాకారులకు గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని కోరుతూ విశాఖ జిల్లా మాకవరపాలెం మండల తహసీల్దార్​ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. కేవీపీఎస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దరఖాస్తు చేసి నెలలు గడుస్తున్నా... ఇప్పటికీ కార్డులు మంజూరు చేయకపోవడం విచారకరమని కేవీపీఎస్​ జిల్లా అధ్యక్షులు చిరంజీవి ఆరోపించారు. అర్హులైన కళాకారులందరికీ ఎస్సీ కార్పొరేషన్​ రుణాలకు ఎంపిక చేయాలని డిమాండ్​ చేశారు. అనంతరం తహసీల్దార్​ రాణి అమ్మాజీకి వినతిపత్రం సమర్పించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details