విశాఖ జిల్లాలోని పాడేరు మన్యం పెదబయలు మండలం వనబంగి సమీప బొంగదారి వాటర్ ఫాల్స్ వద్దకు విహార యాత్రకు వచ్చిన కొందరు... ఆనందోత్సాహాల్లో మునిగి తేలారు. కరోనా మహమ్మారిని తమ నృత్యాలతో సాదరంగా స్వాగతిస్తున్నట్టుగా.. భౌతిక దూరాన్ని మరిచి చిందులు వేశారు. కరోనా కట్టడికి ప్రభుత్వాలు శతవిధాల ప్రయత్నిస్తున్నా.... ఇంకా ఇలాంటి దృశ్యాలు దర్శనమిస్తూనే ఉన్నాయి.
భౌతిక దూరం మరిచారు... చిందులు వేశారు - corona news in ap
చేయి చేయి కలపకురా.... అంటూ పాటలతో ఒక పక్క ప్రజలకు అవగాహన కల్పిస్తుంటే..... చేయి చేయి వీడకురా అన్నట్టుగా వేస్తున్న నృత్యాలు విశాఖలో దర్శనమిస్తున్నాయి. భౌతిక దూరం పట్టని నిర్లక్ష్యాన్ని స్పష్టం చేస్తున్నాయి.
విశాఖ మన్యం విహారయాత్రలో నృత్యాలు