బాలల దినోత్సవం సందర్భంగా... రౌండ్ టేబుల్ ఇండియా స్వచ్ఛంద సంస్థ విశాఖలో దివ్యాంగ విద్యార్థులకు నృత్య పోటీలు నిర్వహించింది. బీచ్‌రోడ్‌లోని విశాఖ ఫంక్షన్ హాల్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో... నగరానికి చెందిన 8 దివ్యాంగ పాఠశాలల నుంచి విద్యార్థులు హాజరయ్యారు. సాంప్రదాయ, జానపద నృత్యాలు చేసి అందరిని అలరించారు. దివ్యాంగ విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసే ఉద్దేశంతో... ఈ పోటీలు నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.
విశాఖలో దివ్యాంగ విద్యార్థుల నృత్య పోటీలు - dance competitions for physically challenged students at vizag latest news
విశాఖలోని పలు దివ్యాంగ పాఠశాలల విద్యార్థులకు నృత్య పోటీలు నిర్వహించారు. బాలల దినోత్సవం సందర్భంగా స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన ఈ పోటీల్లో... దివ్యాంగులు పాల్గొని అందరినీ అలరించారు.
నృత్యాలు చేస్తున్న విద్యార్థులు