ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖ కలెక్టరేట్​లో దామోదరం సంజీవయ్య జయంతి వేడుకలు - vishakha collectorate news

విశాఖ కలెక్టరేట్​లో దామోదరం సంజీవయ్య జయంతి వేడుకలను నిర్వహించారు. కలెక్టర్ వి.వినయ్​ చంద్ సంజీవయ్య చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళి అర్పించారు.

collector vinaychand
విశాఖ కలెక్టరేట్​లో దామోదరం సంజీవయ్య జయంతి వేడుకలు

By

Published : Feb 14, 2021, 3:37 PM IST

దామోదరం సంజీవయ్య జయంతి సందర్భంగా... విశాఖ జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సంజీవయ్య జయంతి కార్యక్రమంలో కలెక్టర్​తో పాటు జేసీ​ ఎం.వేణుగోపాల్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి ఎ.ప్రసాద్, సాంఘిక సంక్షేమ శాఖ సంయుక్త సంచాలకులు డివి రమణమూర్తి, తదితర అధికారులు పాల్గొన్నారు. ఓ నిస్వార్థ రాజకీయ నాయకుడిగా పేదలకు ఎనలేని సేవ చేసిన మహానేతగా సంజీవయ్యను స్మరించుకున్నారు. నేటి యువత ఆయనను ఆదర్శంగా తీసుకొని... ఆయన ఆశయాల కోసం పాటుపడాలని కలెక్టర్ సూచించారు.

ABOUT THE AUTHOR

...view details