ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మాజీ కౌన్సిలర్​పై దళిత ప్రగతి ఐక్య సంఘం ఫిర్యాదు

By

Published : Mar 25, 2021, 3:17 PM IST

విశాఖ జిల్లా నర్శీపట్నం మాజీ కౌన్సిలర్ మామిడి అరుణ కుమారిపై చర్యలు తీసుకోవాలని.. దళిత ప్రగతి ఐక్య సంఘం విశాఖలో కోరారు. తప్పుడు ఎస్సీ ధ్రువీకరణ పత్రంతో కౌన్సిలర్ పదవి పొందిన ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Dalit Pragati Aikya Sangh complaint
దళిత ప్రగతి ఐక్య సంఘం ఫిర్యాదు

తప్పుడు ఎస్సీ ధ్రువీకరణ పత్రంతో కౌన్సిలర్ పదవి పొందిన విశాఖ జిల్లా నర్శీపట్నం మాజీ కౌన్సిలర్ మామిడి అరుణ కుమారిపై చర్యలు తీసుకోవాలని.. దళిత ప్రగతి ఐక్య సంఘం విశాఖలో డిమాండ్ చేసింది. ఆమెపై ఫిర్యాదు చేసినందుకు.. తన వర్గీయులతో అరుణ కుమారి దళితులపై దాడులు చేయిస్తున్నారని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు కొండ్రు మరిడయ్య ఆరోపించారు. దీనిపై అధికారులకు పిర్యాదు చేసినా చర్యలు తీసుకోవట్లేదని వాపోయారు.

తప్పుడు ధ్రువీకరణ పత్రంతో కౌన్సిలర్ పదవి పొందిన ఆమెపై.. ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ, చీటింగ్ కేసులు నమోదు చేసి.. ఇలాంటి తప్పులు ఎవరూ చేయకుండా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తప్పుడు ధ్రువపత్రాలు జారీ చేసిన అధికారులపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇవీ చూడండి...

పాడేరు మాతాశిశు ఆస్పత్రిలో అరకొర వసతులు.. గర్భిణుల అవస్థలు

ABOUT THE AUTHOR

...view details