ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఆ స్థలం మాదే..అక్కడ పార్క్​, గ్రంథాలయం నిర్మిస్తాం' - Dalit leader to build Ambedkar Park in Srirampuram

విశాఖ జిల్లా పాయకరావుపేటలో అంబేడ్కర్ పార్క్, గ్రంథాలయం నిర్మాణం చేపట్టనున్నట్లు దళిత నాయకుడు ఏనుగుపల్లి రాజేశ్వరరావు తెలిపారు. ఆ ప్రాంతంలోని స్థలం తమ పూర్వీకులదని.. దానిపై వస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని ఆయన చెప్పారు.

దళితనాయకుడు ఏనుగుపల్లి రాజేశ్వరరావు
Dalit leader Enugupalli Rajeshwara Rao

By

Published : Jun 16, 2021, 2:04 PM IST

విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గ పరిధిలోని శ్రీరాంపురం గ్రామంలో రహదారికి అనుకుని ఉన్న ఖాళీ స్థలంలో అంబేడ్కర్ పార్క్, గ్రంథాలయ నిర్మాణం చేపడతామని దళిత నాయకుడు ఏనుగుపల్లి రాజేశ్వరరావు తెలిపారు. ఈ స్ధలం తమ పూర్వీకుల నుంచి ఆధీనంలో ఉందని చెప్పారు. తాము ఆక్రమించినట్లు కొందరు ఆరోపణలు చేస్తున్నారని వివరించారు. ప్రస్తుతం ఉన్న స్థలంలో పార్క్, విద్యార్థులకు ఉపయోగపడే విధంగా విజ్ఞాన మందిరం, సామాజిక భవనం నిర్మిస్తామని పేర్కొన్నారు

ABOUT THE AUTHOR

...view details