వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం జారీచేసిన 136 జీవో ప్రకారం మేనేజ్మెంట్ కోటాలో రిజర్వేషన్లు జరపాలని ఐక్య వేదిక కన్వీనర్ డాక్టర్ బూసి వెంకట్రావు ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం మంత్రి కన్నబాబుకు వివరించారు. రాష్ట్రంలో మెడికల్ సీట్ల కేటాయింపులో రిజర్వేషన్ సక్రమంగా అమలు జరగడం లేదని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. మంత్రి కన్నబాబు సానుకూలంగా స్పందించి, తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని ఐక్య వేదిక సభ్యులు తెలిపారు. ఐక్య వేదిక ప్రతినిధి బృందంలో సహ కన్వీనర్ కొత్తపల్లి వెంకటరమణ, సహాయ కన్వీనర్ సూర్యం, తదితరులు ఉన్నారు.
'ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయాలి' - ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో సీట్లపై కన్నబాబు కామెంట్స్
ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో జీవో నెంబర్ 136 ద్వారా రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయాలని కోరుతూ విశాఖ జిల్లా దళిత సంఘాల ఐక్యవేదిక విశాఖ ఇన్ఛార్జి మంత్రి కన్నబాబును కలిశారు. విశాఖలో నిర్వహించిన జిల్లా అభివృద్ధి సమావేశానికి హాజరైన మంత్రి కన్నబాబుకు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మెడికల్ సీట్ల కేటాయింపులో జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు.
'ప్రైవేట్ మెడికల్ కళాశాల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయాలి'
TAGGED:
go no 36 latest news