విశాఖ జిల్లా చీడికాడ మండలం వరహపురానికి సమీపంలో ఉన్న చెరువులో చేపల పెంపకందారులు కోళ్ల ఫారం వ్యర్థాలను వేస్తున్నారు. ఫలితంగా చెరువులో నీరు రంగు మారుతున్నాయని, అవి తాగిన పశువులు మృత్యువాత పడుతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. వ్యర్థాలను అందులో వేయకూడదని ఎన్నిసార్లు చెప్పినా చేపల పెంపకందారుల తీరు మారడం లేదని తెలిపారు. పంచాయతీ, పశుసంవర్ధక శాఖ అధికారులు స్పందించి కోళ్ల వ్యర్ధాలను చెరువులో కలపకుండా చర్యలు తీసుకోవాలని వరహపురం రైతులు కోరుతున్నారు.
చెరువులో కోళ్ల వ్యర్థాలు.. పాడి రైతులకు తప్పని కష్టాలు - చీడికాడ మండలం వరహాపురం చెరువులో కోళ్ల వ్యర్థాలు
చేపల కోసం వాటి పెంపకందారులు చెరువులో కోళ్ల వ్యర్థాలను వేశారు. దాంతో నీరు కలుషితం అయ్యాయి. రంగు మారాయి. పశువులు ఆ నీరు తాగి మృత్యువాత పడ్డాయి. దీనిపై పశుపోషకులు, రైతులు ఆందోళన చెందుతున్నారు.
చెరువులో కోళ్ల వ్యర్థాలు