మాజీ ఎంపీ లగడపాటి సర్వేలను జనాలు నమ్మరని మాజీ మంత్రి దాడి వీరభద్రరావు పేర్కొన్నారు. విశాఖ జిల్లా అనకాపల్లిలో విలేకరులతో మాట్లాడిన దాడి... లగడపాటికి సర్వేల పేరుతో ప్రజలను మోసం చేయడం అలవాటుగా మారిందన్నారు. చంద్రగిరిలో రిపోలింగ్ జరుగుతుండగా ఓటర్లను ప్రభావితం చేసేలా ప్రజలు సైకిల్ ఎక్కారని ఎలా చెబుతారని ప్రశ్నించారు. తెలంగాణ ఎన్నికల్లో తెరాస ప్రభావం ఉన్నప్పటికీ... కాంగ్రెస్కు అనుకూలంగా చెప్పి విశ్వసనీయత కొల్పోయిన విషయం గుర్తుచేశారు.
లగడపాటి సర్వేలను ప్రజలు నమ్మరు: దాడి - ap elections
జగన్ కచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారని మాజీ మంత్రి, వైకాపా నేత దాడి వీరభద్రరావు ధీమా వ్యక్తం చేశారు. వైకాపా విజయం సాధిస్తుందన్నారు.
లగడపాటి సర్వేలను ప్రజలు నమ్మరు: దాడి