Cyber Crime in Visakhapatnam: సైబర్ మోసాల గురించి ఎంతగా అవగాహన కల్పిస్తున్నా నిత్యం ఎవరో ఒకరు సైబర్ నేరగాళ్ల గేలానికి చిక్కుతున్నారు. తాజాగా సైబర్ మోసాల గురించి ఎంతో కొంత అవగాహన కలిగి ఉండాల్సిన సాఫ్ట్వేర్ ఉద్యోగినే.. సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. పార్ట్ టైం ఉద్యోగం పేరిట విశాఖ నగరవాసి నుంచి రూ.8.82 లక్షలను సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టారు. తగరపువలసకు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీరుకు ఓ వాట్సాప్ నెంబరు నుంచి పార్ట్ టైమ్ జాబ్ చేసుకుని డబ్బులు సంపాదించవచ్చు అని సందేశం వచ్చింది. అతనిని నమ్మించేందుకు 100 రూపాయలను అతని ఖాతాలో జమ చేసి.. చాటింగ్ ద్వారా పరిచయం పెంచుకున్నారు. తర్వాత వివిధ టాస్క్‌ల పేరిట అతన్ని మోసం చేసి రూ.8.82 లక్షలను కొల్లగొట్టారు. ఇంకా డబ్బులు పంపించాలి.. మీ టాస్క్ పూర్తవుతుందని చెప్పటంతో తాను మోసపోయినట్లుగా గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.
వంద రూపాయలతో 8.82 లక్షలు స్వాహా.. సాఫ్ట్వేర్ ఉద్యోగికే బురిడీ - latest cyber crimes in visakhapatnam
Cyber Crime in Visakhapatnam: సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త ఆలోచనతో వస్తూ ప్రజలను బోల్తా కొట్టిస్తున్నారు. తాజాగా వంద రూపాయలు ఖాతాకు పంపించి.. తద్వారా పరిచయం పెంచుకున్నారు. ఇలా కొద్దిరోజుల గడిచిన తరువాత పార్ట్ టైమ్ జాబ్ అంటూ కథలు చెప్పడం ప్రారంభించారు. ఇందులో భాగంగా వివిధ టాస్క్‌ల పేరుతో ఏకంగా 8.82 లక్షల రూపాయలను విశాఖ వాసి నుంచి దోచేశారు.
సైబర్ మోసం