సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు పలురకాల ఎత్తుగడలతో వ్యక్తుల బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తూనే ఉన్నారు. విశాఖ ఏజెన్సీ చింతపల్లి మండలం కొత్తపల్లిలో గ్రామ సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్‌గా మాధవి అనే మహిళ ఉద్యోగం చేస్తోంది. ఆమె భర్త ఇమాన్యుల్కు బ్యాంకు మేనేజర్‌నంటూ ఒక వ్యక్తి నుంచి ఫోన్‌కాల్ చేశాడు. మీ ఏటీఎం కార్డు గడువు ముగిసింది... వివరాలు చెప్పాలంటూ అడిగారు. విషయం గుర్తించలేని ఇమాన్యూల్ ఫోన్లో వచ్చిన ఓటిపి చెప్పగానే ఖాతా నుంచి రూ. 20,000 రూపాయలు సైబర్ నేరగాళ్లు చోరీ చేశారు.
బ్యాంక్ మేనేజర్‌నంటూ.. మనీ కాజేశాడు - విశాఖలో సైబర్ నేరగాళ్లు తాజా వార్తలు
బ్యాంక్ మేనేజర్‌ను ఫోన్ చేస్తున్నాను.. మీ ఏటీఎం వివరాలు చెప్పడంటూ ఫోన్ చేసి ఖాతా నుంచి రూ. 20 వేల రూపాయలు కాజేసిన ఘటన విశాఖ జిల్లా మన్యంలో చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న ఖాతాదారుడు పోలీసులకు ఫిర్యాదు చెశాడు.
విశాఖ ఏజెన్సీలో సైబర్ మోసగాళ్లు
బ్యాంక్ ఖాతా నుంచి నగదు విత్ డ్రా అయ్యిందని తెలుసుకున్న ఖాతాదారుడు లబోదిబోమన్నాడు. విషయాన్ని ఏఎస్పీ సతీష్ కుమార్‌కు ఫిర్యాదు చేశాడు. బ్యాంకు ఎకౌంట్‌కు సంబంధించిన నగదు లావాదేవీలు, ఏటీఎం వివరాలు ఏ వ్యక్తి ఫోన్లో అడిగినా చెప్పకూడదని సూచించారు. ఇలాంటి విషయాల్లో మరింత జాగ్రత్తగా ఉండాలని ఏఎస్పీ సతీష్ కుమార్ సూచించారు.
ఇవీ చూడండి...