హెర్బల్ ఆయుర్వేద పంపిణీదారు పేరిట ఆన్లైన్ మోసాలకు పాల్పడిన వ్యక్తిని విశాఖ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. కర్నూలుకు చెందిన అబ్దుల్ ముఫీజ్ కొంత కాలంగా హెర్బల్ ఉత్పత్తుల పంపిణీదారులు కావాలంటూ పత్రికా ప్రకటనలు ఇచ్చి పలువురి దృష్టిని ఆకర్షించాడు.
ఆన్లైన్లో మోసాలకు పాల్పడిన వ్యక్తి అరెస్టు - cyber crime in visakhapatnam
హెర్బల్ ఆయుర్వేద పంపిణీదారు పేరిట ఆన్లైన్ మోసాలకు పాల్పడిన వ్యక్తిని విశాఖ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 3 సెల్ఫోన్లు, 4 ఏటీఎం కార్డులు, రూ.34 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.
పంపిణీదారు నియామకం కోసం రూ.11.50 లక్షలను వివిధ ప్రాంతాలకు చెందిన వ్యక్తుల నుంచి వసూలు చేశాడు. ఈ క్రమంలో విశాఖకు చెందిన ఓ వ్యక్తి సైబర్ క్రైం పోలీసులకు సమాచారం అందించాడు. లక్ష రూపాయలను ఆన్లైన్ ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తే... పంపణీ సామగ్రి పంపుతానని ముఫీజ్ చెప్పగా ఆమొత్తాన్ని పంపినట్టు బాధితుడు ఫిర్యాదులో వివరించాడు.
విచారణ చేపట్టిన విశాఖ సైబర్ క్రైం సీఐ గోపీనాధ్ బృందం... నిందితుడు కర్నూలుకు చెందిన ముఫీజ్గా గుర్తించారు. ఇతర ప్రాంతాలకు చెందిన వారిని ఇదే తరహాలో మోసం చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ముఫీజ్ను అరెస్టు చేసి అతడి నుంచి 3 సెల్ఫోన్లు, 4 ఏటీఎం కార్డులు, రూ.34 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. బాధితుల్లో శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి, కృష్ణా జిల్లా, తెలంగాణా రాష్ట్రం వారు ఎక్కువ మంది ఉన్నట్లు పోలీసులు వివరించారు.