ఎమ్యెల్యే టిక్కెట్ ఇప్పిస్తామని ప్రముఖులను మోసం చేసిన వ్యక్తులను విశాఖ కమిషనరేట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు విష్ణుమూర్తి సహా... తరుణ్‌కుమార్, జయకృష్ణ, జగదీష్‌లను పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి రూ.5.80 లక్షల నగదు, 28.22 గ్రాముల బంగారం, 5సెల్ఫోన్లు, ఇంటర్నెట్ పరికరాలు స్వాధీనం చేసుకున్నారు.
ఎమ్మెల్యే టిక్కెట్ ఇప్పిస్తామని... కుచ్చుటోపీ! - mahesh chandra laddha
విశాఖ నగరానికి చెందిన సైబర్ మోసగాళ్ల బండారం బట్టబయలైంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎమ్యెల్యే టిక్కెట్ ఇప్పిస్తానని ప్రముఖులకు కుచ్చుటోపీ పెట్టిన వ్యక్తుల గుట్టు రట్టైంది. నిందితులు ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు.
సీఎం జగన్మోహన్ రెడ్డి, మాజీ సీఎం చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శుల్లా మాట్లాడి నాయకులను నమ్మించారు. వాట్సప్ కాల్స్, మెసేజ్‌ల ద్వారా... మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ నుంచి రూ.10లక్షలు, ప్రస్తుత పలాస ఎమ్మెల్యే సిదిరి అప్పలరాజు నుంచి రూ.15 లక్షల నొక్కేశారు. బండారు సత్యనారాయణ, దాట్ల సుబ్బరాజు, వాసుపల్లి గణేష్‌కుమార్, సిదిరి అప్పలరాజు ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఎట్టకేలకు నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్ చేశారు.
ఇదీ చదవండీ...తమిళనాడు: విలువైన పురాతన విగ్రహాలు లభ్యం