ఐటీడీఏ గ్యాస్ ఏజెన్సీ వద్ద బారులు తీరిన వినియోగదారులు
పాడేరు ఐటీడీఏ గ్యాస్ ఏజెన్సీ వద్ద వినియోగదారులు బారులు తీరారు. సామాజిక దూరం పాటించకుండా లబ్ధిదారులు గుంపులు గుంపులుగా 5 గంటలు వేచి ఉన్నారు.
విశాఖ ఏజెన్సీ పాడేరులో ఐటీడీఏ గ్యాస్ ఏజెన్సీ వద్ద వినియోగదారులు బారులు తీరారు. నెల చివర కావడంతో గ్యాస్ నిల్వలు అయిపోయాయని గ్యాస్ ఇప్పించాలంటూ పడిగాపులు కాశారు. ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి డీకే బాలాజీ మాట్లాడుతూ ఇంటింటికి గ్యాస్ సరఫరా చేస్తామని ప్రకటన చేశారు. దీంతో లబ్ధిదారులు వెనుదిరిగారు. హుకుంపేట తీగల వలస రేషన్ డిపో వద్ద సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన గిరిజనులు సామాజిక దూరం, కరోనాపై అవగాహన లేకపోవడంతో రేషన్ దుకాణం వద్ద గుమిగూడారు. వారికి సచివాలయం సిబ్బంది సైతం అవగాహన కల్పించలేదు. పాడేరు జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో కూరగాయల అమ్మకాలు ప్రారంభించారు. అక్కడ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మీ వ్యాపారులకు మాస్కులు పంపిణీ చేశారు.