విశాఖపట్నం జిల్లా దేవరాపల్లి మండలం రైవాడ జలాశయంలో నీటిమట్టం సమృద్ధిగా ఉంది. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు జలాశయంలో కొత్త నీరు వచ్చి చేరుతోంది. దీంతో జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 114 మీటర్లు కాగా, ప్రస్తుతం 111.70 మీటర్ల మేర నీరు చేరింది. వరి ఆకు ఏపుగా పెరిగి, వరినాట్లకు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఆయకట్టు ప్రాంతంలో వరినాట్లకు సాగునీటిని విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు. జలవనరుల శాఖ అధికారులు నీటి విడుదలకు ప్రణాళిక చేపట్టారు. ఎమ్మెల్యే, సాగునీటి సంఘాలతో జలవనరుల శాఖ అధికారులు సమావేశమై.. ఆగస్టు 4న రైవాడ జలాశయం నుంచి ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. దీంతో రైతులు వరి నాట్లుకు ఉత్సాహంగా సిద్ధమవుతున్నారు.
ఆగస్టులో రైవాడ జలాశయం నుంచి ఆయకట్టుకు సాగు నీరు - ఆయకట్టుకు సాగు నీరు తాజా వార్తలు
విశాఖ జిల్లా దేవరాపల్లి మండలం రైవాడ జలాశయంలో నీటి నిల్వలు ఆశాజనకంగా ఉన్నాయి. ఎగువ ప్రాంతంలో కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు జలాశయంలో సమృద్ధిగా నీటి నిల్వలు చేరాయి. వచ్చే నెలలో ఖరీఫ్ సాగుకు సాగునీటి విడుదల చేసేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
రైవాడ జలాశయానికి భారీగా నీరు