విశాఖలో క్షేత్రస్థాయిలో పర్యటించిన సీఎస్ఐఆర్-ఎన్ఈఈఆర్ఐ నిపుణుల బృందం.. నివేదికను కేంద్రానికి సమర్పించింది. పరిశ్రమ సమీపంలోని రహదారులు, ఇళ్లలో స్టైరిన్ అవశేషాలు గుర్తించిన నిపుణులు... భూమి లోపల 1.5 పీపీఎం, భూ ఉపరితరంలో 4.5 పీపీఎంపైన ఉన్నట్లు నివేదిక ఇచ్చారు. ఓ ఇంట్లో అత్యధికంగా 1.7 పీపీఎం స్టైరిన్ గుర్తించినట్లు నివేదికలో తెలిపారు.
నిపుణుల బృందం సిఫార్సు చేసిన అంశాలు
- ప్రభావిత ప్రాంతాలైన వెంకటాపురం, వెంకటాద్రి నగర్, నందమూరి నగర్, పైడిమాంబ కాలనీ, బీసీ కాలనీ ప్రజలు.. ఘటన జరిగిన ప్రదేశానికి 3 కిలోమీటర్ల పరిధిలో పండిన కూరగాయలు, పండ్లు తినరాదు.
- పశువులకు అక్కడి గ్రాసాన్ని అందించరాదు.
- తదుపరి నివేదిక వచ్చే వరకు అక్కడి పాలు, పాల సంబంధిత ఉత్పత్తులను సైతం వినియోగించరాదు.
- మూడు కిలోమీటర్ల పరిధిలో నీటిని తాగేందుకు, వంటకు వినియోగించకూడదు.