CISF constable in Pakistani woman honeytrap సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిసున్న ఓ అధికారి.. పాకిస్థాన్‌కు చెందిన ఓ మహిళ హనీట్రాప్‌లో పడ్డాడు. న్యూడ్ వీడియో కాల్స్‌తో మొదలైన వారి పరిచయం.. ఓ గదిలో రహస్యంగా కలిసేంత వరకు వెళ్లింది. ఆ తర్వాత ఆ అధికారి (సీఐఎస్‌ఎఫ్ కానిస్టేబుల్) ఆ మహిళ ద్వారా పాకిస్థానీ గూఢాచార సంస్థకు దేశ అంతర్గత వ్యవహారాలకు సంబంధించిన సమాచారాన్ని చేరవేస్తున్నట్లుగా అధికారులు అనుమానించారు. అతనిపై కేసు నమోదు చేసి మొబైల్ ఫోన్లు తనిఖీ చేయగా.. పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లుగా వెల్లడించారు.
విశాఖలో హనీట్రాప్ కలకలం.. విశాఖపట్నం జిల్లాలో మరో హనీట్రాప్ కలకలం రేపింది. యువతలతో గాలం వేసి.. భారత దేశ అంతర్గత వ్యవహారాలకు సంబంధించిన సమాచారాన్ని పాకిస్థానీ గూఢాచార సంస్థ చేజిక్కించుకుంటోంది. తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్ సెక్యూరిటీ విధుల్లో ఉన్న సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కపిల్ కుమార్, జగదీష్ బాయ్ మురారి చిక్కుకున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా తమీషా అనే పాకిస్థానీతో ఆయనకి పరిచయం ఏర్పడింది. అతడి కదలికలపై అనుమానంతో "రా" ఉన్నతాధికారులు దృష్టి పెట్టారు. రహస్య సమాచారం చేరేవేశారన్న అనుమానాలకు బలం చేకూర్చేలా ఆధారాలు కొన్ని ప్రాథమిక విచార వెలుగులోకి వచ్చాయి. వీటి ఆధారంగా కపిల్ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Honey Trap: ఆన్లైన్లో 'వలపు వల'.. ఉద్యోగులకు హెచ్చరికలు!
వీడియో కాల్స్‌తో మొదలైన పరిచయం.. గుజరాత్‌కి చెందిన కపిల్ కుమార్ తొలుత హైదరాబాద్‌లోని 'భారత్ డైనమిక్స్ లిమిటెడ్'లో విధులు నిర్వహించారు. ఆ తర్వాత 2022 ఆగస్టు 2 నుంచి బదిలీపై వచ్చి విశాఖ స్టీల్ ప్లాంటు సెక్యూరిటీలో చేరారు. ప్రస్తుతం సీఐఎస్ఎఫ్ (C.I.S.F.) ఫైర్ విభాగంలో విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కపిల్‌కి రెండేళ్ల క్రితమే తమీషా అనే మహిళ ఫేస్‌బుక్ ద్వారా పరిచమైంది. ఆ పరిచయం న్యూడ్ వీడియో కాల్స్‌తో మొదలై.. హైదరాబాద్‌లోని ఓ గదిలో రహస్యంగా కలిసేంత వరకు వెళ్లిందని సమాచారం. ఆమె ఓ ఉగ్రవాద సంస్థకు చెందిన పెద్ద నాయకుడి వద్ద వ్యక్తిగత సహాయకురాలిగా పని చేస్తున్నట్లు తెలుస్తోంది. గత రెండేళ్లుగా కపిల్ నుంచి భారత్ డైనమిక్స్ లిమిటెడ్ భద్రతకు, స్టీల్ ప్లాంటు రహస్య సమాచారం బయటకు వెళ్లినట్లు ఉన్నతాధికారులు అనుమానిస్తున్నారు.