ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆంధ్రా - ఒడిశా సరిహద్దుల్లో సీఆర్​పీఎఫ్ అధికారుల పర్యటన

ఆంధ్రా - ఒడిశా సరిహద్దు ప్రాంతమైన విశాఖ మన్యంలో సీఆర్​పీఎఫ్ అధికారులు పర్యటించారు. తీగలమెట్ట వద్ద జరిగిన ఎదురుకాల్పులకు నిరసనగా మావోయిస్టులు ఇవాళ బంద్​కు పిలుపునివ్వగా.. అధికారుల పర్యటన ప్రాధన్యత సంతరించుకుంది. మన్యంలోని పలు ఠాణాల క్యాంపులను వారు పరిశీలించారు.

crpf officers visit aob in vishakapatnam
crpf officers visit aob in vishakapatnam

By

Published : Jul 1, 2021, 7:59 AM IST

ఆంద్రా - ఒడిశా స‌రిహ‌ద్దుల్లోని విశాఖ మ‌న్యంలో సీఆర్‌పీఎఫ్ అదన‌పు డీజీ ర‌ష్మీశుక్లా, ఐజీ మ‌హేష్‌చంద్ర ల‌డ్హా పర్యటించారు. మ‌న్యంలోని అన్న‌వ‌రం, చింత‌ప‌ల్లి, జీ.మాడుగుల పోలీసుస్టేష‌న్‌ల‌లోని క్యాంపులను ప‌రిశీలించారు. కొయ్యూరు మండ‌లం తీగ‌ల‌మెట్ట వ‌ద్ద జ‌రిగిన ఎదురుకాల్పుల‌కు నిర‌స‌న‌గా మావోయిస్టులు ఇవాళ బంద్‌కు పిలుపునివ్వ‌డంతో సీఆర్‌పీఎఫ్ అధికారులు ప‌ర్య‌టన ప్రాధాన్యత సంత‌రించుకుంది.

స్థానికంగా విధులు నిర్వ‌హిస్తున్న సీఅర్​పీఎఫ్ జవాన్లతో, స్థానిక అధికారులతో ఉన్నతాధికారులు సమీక్ష సమావేశం నిర్వ‌హించారు. మావోయిస్టు ప్ర‌భావిత ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు సూచించారు. మ‌న్యంలో గిరిజ‌నుల అభివృద్దికి చేప‌ట్టాల్సిన పారా మిల‌ట‌రీ ద‌ళాల సేవ‌ల‌పై చ‌ర్చించారు. సీఆర్‌పీఎఫ్ సిబ్బంది యోగ‌క్షేమాల‌ను ఏడీజీ, ఐజీ అడిగి తెలుసుకున్నారు. బంద్ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details