ఆంధ్ర - ఒడిశా సరిహద్దు పెదబయలు మండలం రూడకోటలో పోలీసు అవుట్‌పోస్టు పరిధిలోని సచివాలయంలో రూ.5 లక్షల వ్యయంతో మినరల్ వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటుచేశారు. దీనిని సీఆర్పీఎఫ్ 198 బెటాలియన్ కమాండెంట్ చంద్, డీఎస్పీ అశోక్ కుమార్ పాడేరు డీఎస్పీ రాజ్‌కమల్ ప్రారంభించారు.
రూడకోటలో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభం
ఆంధ్ర - ఒడిశా సరిహద్దు రూడకోటలో గిరిజనుల కోసం మినరల్ వాటర్ ప్లాంట్‌ను సీఆర్పీఎఫ్ అధికారులు ప్రారంభించారు. కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా దీనిని నిర్మించినట్టు తెలిపారు.
గిరిజనులకు మినరల్ వాటర్ ప్లాంట్
మండల కేంద్రానికి దూరంగా విసిరేసినట్లు ఉండే రూడకోట పరిసరాల్లో గిరిజనులు తాగునీటి కోసం అనేక అవస్థలు పడుతుంటారు. సమస్యను గుర్తించిన సీఆర్పీఎఫ్ బెటాలియన్ 2020లో ప్లాంట్‌ను నిర్మించింది. కరోనా వల్ల ప్రారంభోత్సవం ఇన్నాళ్లూ ఆలస్యమైంది. కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా మినలర్ వాటర్ ప్లాంట్‌ను అందుబాటులోకి తెచ్చి ప్రజలకు అందజేసినట్టు అధికారులు తెలిపారు.