ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖలో కాకుల మృతి.. అధికారులు ఆరా! - atchutapuram latest news

విశాఖలో కాకుల మృతి కలకలం రేపుతోంది. అచ్యుతాపురంలో కొన్నిరోజుల క్రితం కొన్ని కాకుల మృతిచెదంగా.. తాజాగా జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో కాకులు చనిపోవడంపై స్థానికులు ఆందోళన చెందుతున్నారు. వీటి మృతికి కారణం బర్డ్​ ఫ్లూనా లేక వేరే ఏదైనా కారణమా..? అనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు.

crows died near visakhapatnam collector office
విశాఖలో కాకుల మృతి

By

Published : Jan 11, 2021, 5:53 PM IST

విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో కాకులు మృతి కలకలం రేపుతోంది. బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాప్తి చెందుతుందని ప్రచారం జరుగుతున్న క్రమంలో పక్షులు చనిపోవడం స్థానికులను ఆందోళనకు గురి చేస్తోంది. రెండు రోజుల క్రితమే అచ్యుతాపురం మండలంలో కొన్ని కాకులు చనిపోయాయి. వాటి మృతికి బర్డ్ ఫ్లూ వైరస్​కు సంబంధం లేదని అధికారులు తేల్చి చెప్పారు.

అయితే సరిగ్గా ఒకరోజు తేడాతోనే జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఆవరణంలోని పోస్ట్ ఆఫీస్ ఎదురుగా ఆరు కాకులు నిమిషాల వ్యవధిలోనే గిలగిల కొట్టుకుంటూ ప్రాణాలు విడిచాయి. వీటి మృతిపై అధికారులు ఆరా తీస్తున్నారు. కలెక్టర్ కార్యాలయం ఆవరణలోనే పక్షులు మృతిచెందడంతో.. వాటి మృతికి కారణాలు తెలుసుకోవాలని సంబంధిత అధికారులను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు.

ఇదీ చదవండి:కలకలం రేపుతోన్న కాకుల మృతి..కారణాలను అన్వేషిస్తున్న అధికారులు

ABOUT THE AUTHOR

...view details