ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆధార్​ అనుసంధానానికి.. జనం అగచాట్లు - చోడవరం తాజావార్తలు

ఆధార్​ను చరవాణి నంబర్​తో అనుసంధానం చేసుకునేందుకు.. సంబంధిత కేంద్రాల వద్ద ప్రజలు పడిగాపులు కాస్తున్నారు. విశాఖ జిల్లా చోడవరం పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆధార్​ కేంద్రానికి వచ్చిన జనంతో ఆ ప్రాంతమంతా రద్దీగా మారింది.

aadhar center
ఆధార్​ కేంద్రం వద్ద వేచి ఉన్న జనం

By

Published : Jun 10, 2021, 10:10 AM IST

ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు తమ ఆధార్​ను ఫోన్​ నంబర్​తో అనుసంధానం చేయాలని ప్రభుత్వం నిబంధన తీసుకురావడంతో ఆధార్​ కేంద్రాల వద్ద జనం బారులు తీరుతున్నారు. విశాఖ జిల్లా చోడవరం పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆధార్​ కేంద్రానికి అధిక సంఖ్యలో ప్రజలు తరలిరావటంతో రద్దీ వాతావరణం ఏర్పడింది.

ఉదయం కార్యాలయం గేటు తెరవక ముందే వచ్చి రోడ్లపై గుంపులుగా చేరారు. కరోనా వ్యాప్తి వేళ నిబంధనలు మరచి... పని జరిగితే చాలన్నట్లు జనం వ్యవహరిస్తున్నారు. ఆధార్​ లింక్​ జరగకపోతే తాము పథకాల ద్వారా లబ్ధిపొందలేమని చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details