విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గం మాడుగుల, చీడికాడ, కె.కోటపాడు, దేవరాపల్లి మండలాల్లో మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. ఉదయం తొమ్మిది గంటల నుంచే మందుబాబులు దుకాణాల వద్ద బారులు తీరారు. అయితే ధరల పట్టికకు సంబంధించి అనుమతి రాకపోవటంతో... 12 గంటల వరకు అమ్మకాలు జరగలేదు. అయినా మద్యం ప్రియులు ఎంతో ఓపికతో వరుసలో నిలుచున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో విక్రయాలు జోరుగా సాగాయి.
మాడుగులలో మద్యం దుకాణాల వద్ద జనం బారులు - corona news in vizag
చిన్నపిల్లలు పాలకోసం ఎగబడినట్లు మందుబాబులు మందుకోసం ఎగబడ్డారు. విశాఖ జిల్లాలో 9 గంటల నుంచే దుకాణాల వద్ద బారులు తీరారు. 12 గంటల వరకూ మద్యం అమ్మకాలు జరగకపోయినా ఓపికగా వేచిచూశారు.
croud at wine shops in visakha dst