ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'31 మండలాల్లో 37,494 మంది రైతులకు పంట నష్టం' - crop loss estimated report of visakha

గత నెలలో కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా విశాఖ జిల్లాలో 75,67,993 హెక్టార్లలో పట్ట దెబ్బ తిన్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు నిర్దరించారు. మొత్తం 31 మండలాల్లో 37,494 మంది రైతులు నష్టపోయారని ప్రభుత్వానికి నివేదించారు.

crop loss estimated report of visakha
మొత్తం 31 మండలాల్లో 37,494 మంది రైతులకు పంట నష్టం

By

Published : Dec 25, 2020, 4:54 PM IST

నివర్ తుపాను, భారీ వర్షాలు, వరదల కారణంగా విశాఖపట్నం జిల్లాలో 75,67,993 హెక్టార్లలో పంటలు దెబ్బ తిన్నట్టు జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు నిర్ధరించారు. దీనిలో 75,27,993 హెక్టార్లలో వరి, 40 హెక్టార్లలో చెరుకు పంటలు ఉందన్నారు. మొత్తం 31 మండలాల్లో 37,494 మంది రైతులు నష్టపోయారని ప్రభుత్వానికి నివేదించారు.

మొత్తం 31 మండలాల్లో 37,494 మంది రైతులకు పంట నష్టం

అత్యధికంగా ఎస్ రాయవరం మండలంలో 5,683 మంది రైతులకు చెందిన 1406 హెక్టార్ల వరి పంట పాడైపోయిన నివేదికలో పేర్కొన్నారు. అతి తక్కువగా చింతపల్లి మండలంలో ఆరుగురు రైతులకు చెందిన 192 హెక్టార్ల పంట నష్టం వాటిల్లిందని నివేదించారు. ఇన్​ఫుట్ సబ్సిడీ కింద హెక్టారుకు రూ. 15 వేల చొప్పున 7567.993 హెక్టార్లకు సంబంధించి రైతులకు పరిహారం అందునుంది. పంట నష్టంపై ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక పంపామని ఆయా రైతుల బ్యాంకు ఖాతాలకు త్వరలో పరిహారం సొమ్ము జమ అవుతుందని వ్యవసాయ శాఖ జిల్లా అధికారులు

ABOUT THE AUTHOR

...view details