నివర్ తుపాను ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు విశాఖ జిల్లాలో వేల ఎకరాల్లో పంట నష్టం ఏర్పడింది. చెరువులు, ఇతర జలాశయాలు పూర్తిగా నిండిపోవడంతో చాలాచోట్ల పంటపొలాలు నీటమునిగాయి. ఈదురు గాలులకు వరి నేలకొరిగిపోయి దెబ్బతింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా పంటలు దెబ్బతిని దిగుబడి తగ్గిపోయే ప్రమాదముందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నర్సీపట్నం, గొలుగొండ, మాకవరపాలెం తదితర మండలాల్లో నేలకొరిగిన వరి పంటలను నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరికొన్ని చోట్ల వ్యవసాయ సిబ్బంది నీటి ముంపునకు గురైన పంట నష్టాన్ని వేస్తున్నారు. జిల్లాలో సుమారు 7,300 హెక్టార్లలో వరి పంట తడిసి పోయినట్టు అధికారులు గుర్తించారు. వర్షాలు తగ్గిన తర్వాత వాస్తవ పంటనష్టాన్ని అంచనా వేస్తామని విశాఖ జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.
పొలాల్లో నీరు బయటికి వెళ్లేందుకు సూచనలు