విశాఖ వీఎంఆర్డీఏ సమావేశ మందిరంలో శాసన మండలి పరిపాలన కమిటీ సమీక్షా సమావేశం జరిగింది. మండలి పరిపాలన సమీక్ష కమిటీ ఛైర్మన్ వై బాబు రాజేంద్ర ప్రసాద్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో వాల్తేర్ క్లబ్, కార్తీక వనం లీజు వంటి అంశాలపై చర్చించారు. కార్తీక వనం విషయంలో రివర్స్ టెండరింగ్‌కు వెళ్లాలని కమిటీ అభిప్రాయపడింది. విశాఖలో సుందర వాతావరణం ఉందని.. దేశానికి రెండో ఆర్థిక రాజధానిగా విశాఖ ఆవిర్భవిస్తుందన్నారు. విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా చేయటం వల్ల ప్రశాంత నగరంలో నేరాలు, భూ ఆక్రమణలు పెరిగే అవకాశముందన్నారు.
'ప్రశాంత విశాఖలో నేరాలు, భూ ఆక్రమణలు పెరుగుతాయి'
విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా చేయటం వల్ల ప్రశాంత నగరంలో నేరాలు, భూ ఆక్రమణలు పెరిగే అవకాశముందని మండలి పరిపాలన సమీక్ష కమిటీ ఛైర్మన్ వై బాబు రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యానించారు.
మండలి పరిపాలన సమీక్ష కమిటీ ఛైర్మన్ వై బాబు రాజేంద్ర ప్రసాద్