ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అప్పన్న ఆలయంలో వస్తువుల మాయంపై దర్యాప్తు - simhachalam temple latest news

సింహాచలం అప్పన్న స్వామి ఆలయ కల్యాణ మండపంలో భద్రపరిచిన ఇత్తడి వస్తువులు మాయమైన ఘటనలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. వస్తువులు ఎక్కడ ఉంచారు? ఎలాంటి భద్రత కల్పించారు? తదితర వివరాలు ఇప్పటికే సేకరించిన అధికారులు... ఇవి చోరీకి గురయ్యాయా? లేక వ్యాపారి తీసుకెళ్లారా? అనే విషయాలపై దర్యాప్తు చేస్తున్నారు.

Simhachalam temple
Simhachalam temple

By

Published : Oct 12, 2020, 6:27 PM IST

విశాఖ జిల్లాలోని సింహాచలం వరాహలక్ష్మినరసింహ దేవస్థానంలో భక్తులు సమర్పించిన ఇత్తడి కానుకల మాయంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని క్రైం డీసీపీ సురేష్ బాబు తెలిపారు. దీనికి సంబంధించి ఆలయ అధికారులు గోపాలపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. ఆలయంలోని సీసీ కెమెరాలను పరిశీలించామన్నారు.

భక్తులు మొక్కుబడిగా హుండీలో కడియాలు, ఇత్తడితో చేసిన కోడెదూడ బొమ్మలను వేస్తుంటారు. వాటిని ఇటీవల వేలం వేశారు. వేలం దక్కించుకున్న వ్యాపారి కొంత తరుగు ఇవ్వాలని ఆలయ అధికారులను కోరటంతో కొద్దిరోజులుగా వాటిని మూటలుకట్టి స్థానిక కల్యాణ మండపంలో ఉంచారు. సుమారు 50 బస్తాలను భద్రపరచగా 40 బస్తాలకు పైగా మాయమైనట్లు సమాచారం. ఇవి చోరీకి గురయ్యాయా లేక వ్యాపారి తీసుకెళ్లారా అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details