విశాఖ సీతమ్మధారలోని కేఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో క్రెడాయ్ ,రెడ్ క్రాస్, రోటరీ బ్లడ్ బ్యాంకు సంయుక్తంగా మెగా రక్త దాన శిభిరాన్ని నిర్వహించాయి. కరోనా సమయంలో చాల మంది రక్త దానానికి దూరంగా ఉన్నారు. ఫలితంగా బ్లడ్ బ్యాంకుల దగ్గర రక్త నిల్వలు తగ్గాయి. దాంతో చాలా మంది రోగులు ఇబ్బంది పడ్డారు.
blood donation camp: సీతమ్మధారలో మెగా రక్తదాన శిబిరం - Ap
సీతమ్మధారలోని కేఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో క్రెడాయ్ ,రెడ్ క్రాస్, రోటరీ బ్లడ్ బ్యాంకు కలిసి రక్త దాన శిభిరాన్ని నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో విశాఖ పార్లమెంట్ సభ్యుడు ఎంవీవీ సత్యనారాయణ ముఖ్య అతిథి పాల్గొన్నారు.
రక్తదానం
అందుకే తిరిగి రక్త నిల్వల్ని పెంచడానికి రక్త దాన శిబిరం ఏర్పాటు చేశామని క్రెడాయ్ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు అన్నారు. విశాఖ పార్లమెంట్ సభ్యుడు ఎంవీవీ సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని నిర్వాహకులను, రక్త దాతలను అభినందించారు. వారికి సర్టిఫికెట్ అందించారు.
ఇదీ చదవండి:సాఫ్ట్వేర్ కొలువును వదిలి.. చిత్రకళలో సత్తా చాటుతోన్న యువతి