ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖలో డిసెంబర్ 20 నుంచి 'క్రెడాయ్ ప్రాపర్టీ షో' - విశాఖలో ప్రాపర్టీ షో వార్తలు

డిసెంబర్ 20 నుంచి విశాఖలో క్రెడాయ్ ఆధ్వర్యంలో ప్రాపర్టీ షో నిర్వహిస్తున్నట్లు సంస్థ నిర్వాహకులు తెలిపారు. ఇళ్లు, స్థలాలు కొనాలనుకునే వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

విశాఖలో డిసెంబర్ 20 నుంచి 'క్రెడాయ్ ప్రాపర్టీ షో'

By

Published : Nov 3, 2019, 10:53 AM IST

విశాఖలో డిసెంబర్ 20 నుంచి 'క్రెడాయ్ ప్రాపర్టీ షో'

విశాఖలో స్థిరాస్తి సమకూర్చుకోవాలనే వారి ఆలోచనలకు అనుగుణంగా భారీ ప్రాపర్టీ ఎక్స్ పో ఏర్పాటు చేస్తున్నట్లు క్రెడాయ్ విశాఖపట్నం చాప్టర్ వెల్లడించింది. బీచ్ రోడ్డులోని గాదిరాజు ప్యాలెస్​లో డిసెంబర్ 20వ తేదీ నుంచి మూడు రోజుల పాటు ప్రదర్శన ఉంటుందని క్రెడాయ్ ప్రతినిధులు తెలిపారు. ఇళ్ల స్థలాలు, ఫ్లాట్లు, విల్లాలు, లగ్జరీ అపార్ట్​మెంట్లు, నిర్మాణ రంగ వస్తువులకు సంబంధించిన సమగ్ర సమాచారం ఈ ప్రదర్శనలో అందుబాటులో ఉంటుందన్నారు. స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. నగర వాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details